రైతుల ఆందోళనతో నెలకొన్న ప్రతిష్టంభన మంచిది కాదు: వెంకయ్యనాయుడు
- దేశంలో కొనసాగుతున్న రైతు ఉద్యమం
- సమస్యకు త్వరగా పరిష్కారం కనుగొనాలని సూచన
- సానుకూల దృక్పథంతో చర్చలు జరపాలని పిలుపు
- ప్రజాస్వామ్యంలో చర్చలే పరిష్కార మార్గాలని ఉద్ఘాటన
దేశంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు సాగిస్తున్న ఆందోళనలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. రైతుల ఆందోళనలతో నెలకొన్న ప్రతిష్టంభన దేశానికి ఏమంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం కావాలన్న దృక్పథంతో ఇరుపక్షాలు చర్చలు జరపాలని ఆకాంక్షించారు. మారుతున్న పరిస్థితులతో పాటు ఆధునికత అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలే సమస్యలకు పరిష్కార మార్గాలు అని వెంకయ్య ఉద్ఘాటించారు. బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ ఫలప్రదంగా జరిగిందని తెలిపారు. అందరూ సానుకూల దృక్పథంలో చర్చల్లో పాల్గొన్నారని వివరించారు.