ఇంటర్వ్యూ మధ్యలో భూప్రకంపనలను గుర్తించిన రాహుల్ గాంధీ
- నిన్న రాత్రి ఉత్తరాదిని వణికించిన భూప్రకంపనలు
- ఆ సమయంలో ఓ ఆన్ లైన్ ఇంటర్వ్యూలో ఉన్న రాహుల్
- గది మొత్తం కదులుతున్నట్టు ఉందన్న రాహుల్
ఉత్తర భారతాన్ని నిన్న రాత్రి భూప్రకంపనలు వణికించాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలో భూమి కంపించినప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ఆన్ లైన్ ఇంటర్వ్యూలో ఉన్నారు. చరిత్రకారుడు దీపేశ్ చక్రవర్తి, షికాగో యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ విద్యార్థినితో ఆయన ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు.
ఇంటర్వ్యూ మధ్యలో ఆయన మాట్లాడుతూ, భూమి కంపిస్తున్నట్టుందని ఆయన అన్నారు. గది మొత్తం కదులుతున్నట్టుగా ఉందని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఇంటర్యూ వీడియోలో కూడా రికార్డయ్యాయి. నిన్న రాత్రి సంభవించిన భూకంప కేంద్రం తజికిస్థాన్ లో ఉంది. దాని ప్రభావం మన దేశంలో కూడా కనిపించింది. ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.