తెలంగాణలో మార్చి 3 నుంచి ఎంబీబీఎస్ ఫస్ట్​ ఇయర్​​ పరీక్షలు

  • నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
  • మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి
  • మూడు విభాగాలుగా నోటిఫికేషన్లు ఇచ్చిన విశ్వవిద్యాలయం
ఎంబీబీఎస్ పరీక్షల నిర్వహణపై కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి–ఏప్రిల్ లో పరీక్షలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. మూడు విభాగాలుగా పరీక్షలను విభజించి నోటిఫికేషన్లను ఇచ్చింది. పాత నిబంధనల ప్రకారం 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, కొత్త నిబంధనల ప్రకారం 2019–2020 బ్యాచ్ ఫస్టియర్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 3 వరకు  పరీక్షలను నిర్వహించనుంది.

పాత నిబంధనల ప్రకారం హాజరు 75 శాతం, ఇంటర్నల్ మార్కులు 35 శాతం ఉన్నవారిని అర్హులుగా ప్రకటించిన వర్సిటీ.. కొత్త రూల్స్ ప్రకారం 75% హాజరు, 40% మార్కులను అర్హతగా ప్రకటించింది. ఇక, 2016–17 బ్యాచ్ కు చెందిన విద్యార్థుల మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 22 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.


More Telugu News