వరసగా ఆరో రోజు పెరిగిన చమురు ధరలు
- పెట్రోల్, డీజిల్పై 34 పైసల చొప్పున పెంపు
- హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.92.26
- డీజిల్ ధర రూ.86.23
- ఢిల్లీలో పెట్రోలు ధర రూ.88.73, డీజిల్ ధర రూ. 79.06
దేశంలో చమురు ధరలు వరసగా ఆరో రోజు పెరిగాయి. పెట్రోల్, డీజిల్పై 34 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.92.26కు చేరగా, డీజిల్ ధర రూ.86.23గా ఉంది.
అలాగే, వరంగల్లో లీటరు పెట్రోలు ధర రూ.91.71, డీజిల్ ధర రూ.85.64కి పెరిగింది. ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 29 పైసలు, డీజిల్పై 32 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర రూ.88.73, డీజిల్ ధర రూ. 79.06కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోలు రూ.95.21గా ఉండగా, డీజిల్ ధర 86.04గా ఉంది.