తూత్తుకుడిలో ఆసియాలోనే అత్యంత ఎత్తయిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం!
- పీఠంతో కలుపుకుని 135 అడుగుల ఎత్తు
- కదిరివేల్ మురుగన్ ఆలయ సమీపంలో ప్రతిష్ఠాపన
- పనులు పర్యవేక్షిస్తున్న ప్రత్యంగిర దేవశక్తి మఠాలయ స్వాములవారు
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆసియాలోనే అత్యంత ఎత్తయిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం ఏర్పాటు కానుంది. కోవిల్పట్టి సొర్ణమలై పైనున్న కదిర్వేల్ మురుగున్ ఆలయ సమీపంలోని కొండపై ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రూ. 9 కోట్ల వ్యయంతో చేపట్టనున్న విగ్రహం పొడవు పీఠంతో కలిపి 135 అడుగులు ఉండనుంది.
శివగంగై జిల్లా మానామధురైలోని శ్రీముఖ పంచముఖ ప్రత్యంగిర దేవశక్తి మఠాలయ స్వాముల పర్యవేక్షణలో విగ్రహ ప్రతిష్ఠాపన పనులు జరగనున్నాయి. మలేసియాలోని పత్తుమలైలో 108 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని రూపొందించిన తిరువారూర్కు చెందిన స్తపతి త్యాగరాజన్ బృందమే ఈ విగ్రహ పనులను కూడా చేపట్టనుంది. కాగా, ఇటీవల హెచ్ఆర్ అండ్ సీఈ మంత్రి సెవ్వూరు రామచంద్రన్, సమాచార, ప్రసారశాఖ మంత్రి కదంబుర్ రాజు విగ్రహ ప్రతిష్ఠాపన పనులకు శంకుస్థాపన చేశారు.