ఏఐజీ ఆసుప‌త్రికి వెళ్లి.. వైద్యుల‌ను అభినందించిన చిరంజీవి!

  • లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఏఐజీ సేవ‌లు
  • వారి సేవ‌లు గొప్ప‌వ‌ని చిరు ప్ర‌శంస‌లు
  • నిన్న ఆసుప‌త్రికి వెళ్లాన‌ని ట్వీట్
గ‌త ఏడాది క‌రోనా విజృంభ‌ణ సమయంలో విశేష వైద్య సేవ‌లు అందించిన హైదరాబాదులోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రి వైద్యులను సినీన‌టుడు చిరంజీవి అభినందించారు. స్వ‌యంగా ఆ ఆసుప‌త్రికి వెళ్లి వైద్యులు, సిబ్బందితో ముచ్చటించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు.
 
ఏఐజీ ఆసుప‌త్రికి వెళ్లి వైద్యుల‌ను అభినందించే అవ‌కాశం వ‌చ్చిందని చిరంజీవి చెప్పారు. నిన్న అక్క‌డ‌కు వెళ్లి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్రహీత డాక్ట‌ర్ డి.నాగేశ్వ‌ర్ రెడ్డి వైద్య బృందాన్ని క‌లిశాన‌ని తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో వారు చాలా మంది ప్రాణాల‌ను కాపాడార‌ని అభినందించారు.

కాగా, కరోనాను అంతం చేద్దాం అంటూ గ‌త ఏడాది ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సుహృద్భావ పరుగు, నడక కార్యక్రమాలు నిర్వహించ‌గా అందుకు కూడా చిరంజీవి మ‌ద్ద‌తు తెలుపుతూ అప్ప‌ట్లో ఓ వీడియోను విడుద‌ల చేశారు.  


More Telugu News