ప్రపంచంలోనే అతిపెద్ద జూను ఏర్పాటు చేస్తున్న ముఖేశ్ అంబానీ

  • గుజరాత్ లో జూను ఏర్పాటు  చేస్తున్న ముఖేశ్ 
  • జూలో రెస్క్యూ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న వైనం
  • 2023లో ప్రారంభమవుతుందన్న పరిమళ్ నత్వానీ
ప్రపంచంలోని అతి పెద్ద జంతు ప్రదర్శనశాలల్లో ఒకటిగా నిలిచిపోయే జూను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నిర్మిస్తున్నారు. తమ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ జూలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగపడేలా రెస్క్యూ సెంటర్ కూడా ఇందులో ఉంటుంది. 2023లో ఇది ప్రారంభమవుతుందని రిలయన్స్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు అవుతున్న ఖర్చు, ఇతర వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఈ వెంచర్ కు సంబంధించి అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.


More Telugu News