ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ అభ్యర్థి.. వరించిన విజయం
- తాడేపల్లిగూడెం మండలంలో ఘటన
- ప్రచారంలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్
- హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వైనం
- 82 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సర్పంచ్ గా విజయం సాధించాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని పుల్లాయిగూడెంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన నలమోలు శ్రీనివాస రామావతారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. అనంతరం ప్రచారం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు.
దీంతో కుటుంబ సభ్యులు అతడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కాగా, ఏపీలో నిన్న జరిగిన నాలుగో విడత ఎన్నికల పోలింగ్ అనంతరం ఫలితాలు వెల్లడయ్యాయి. రామావతారం తన ప్రత్యర్థిపై 82 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.