ఓటుకు నోటు కేసు: సీడీలు, హార్డ్ డిస్కులు సమర్పించాలని ఏసీబీకి కోర్టు ఆదేశం
- సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు
- ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న విచారణ
- విచారణకు హాజరైన రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సింహా
- తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా
సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో హైదరాబాదు ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు విన్న కోర్టు ఈ కేసు వివరాలకు సంబంధించిన సీడీలు, హార్డ్ డిస్కులను సమర్పించాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. సాక్షుల విచారణ షెడ్యూల్ ఖరారు నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
కాగా, ఇవాళ్టి విచారణకు ఈ కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా వ్యక్తిగతంగా హాజరయ్యారు. దేశంలో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరమే విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ న్యాయస్థానం ఈ కేసులో నిందితులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని గతంలో ఆదేశాలిచ్చింది.
ఈ కేసులో ఈ నెల 16న నిందితులపై అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే. నిందితులపై సెక్షన్ 12 నమోదుతో పాటు ఐపీసీ 120బి రెడ్ విత్ 34 కింద అభియోగాలు నమోదు చేశారు.