పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా

  • తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
  • నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి పల్లా పోటీ 
  • నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు
  • నగరంలో పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ నేత డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులు వెంట రాగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, పల్లా నామినేషన్ వేసే క్రమంలో నగరంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడంతో నగరం గులాబీమయం అయింది.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 14న జరగనుంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు హైదరాబాదు-ఖమ్మం-రంగారెడ్డి స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.


More Telugu News