యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకుల దిగుమతిపై నిషేధం?
- వాటినీ ‘దిగుమతుల నిషేధ జాబితా’లో చేర్చేందుకు సీడీఎస్ యోచన
- త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం
- ఇప్పటికే 101 రకాల ఆయుధాలు, సామగ్రిపై దిగుమతి నిషిద్ధం
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ రంగానికి సంబంధించి దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాల విషయంలో విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలని భారత్ యోచిస్తోంది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్.. దిగుమతుల నిషేధ జాబితాలో వాటినీ చేర్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
దీనిపై భాగస్వాములందరితోనూ సీడీఎస్ రావత్ చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలను ఎప్పటిలోగా సమకూర్చుకోవాలన్న దానిపైనా రక్షణ రంగ పరిశ్రమల వర్గాలతో చర్చిస్తున్నట్టు సమాచారం.
కాగా, గత ఏడాదే 101 ఆయుధాలు, పరికరాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్టిలరీ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, సోనార్ వ్యవస్థలు, రాడార్లు, రవాణా విమానాలను ఆ జాబితాలో చేర్చింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలోని మిలటరీ వ్యవహారాల శాఖకు కేంద్రం ఆ బాధ్యతలు అప్పగించింది.