కుప్పకూలిన మార్కెట్లు.. 1,939 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు
- 1,939 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 6.34 శాతం నష్టపోయిన ఓఎన్జీసీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాటలో పయనిస్తుండటంతో... మన మార్కెట్లు కూడా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,939 పాయింట్లు నష్టపోయి 49,099కి పడిపోయింది. నిఫ్టీ 568 పాయింట్లు కోల్పోయి 14,529 వద్ద స్థిరపడింది.
బ్యాంకెక్స్ 5.04 శాతం, ఫైనాన్స్ 4.75 శాతం, టెలికాం 4.26 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని స్టాకులు నష్టపోయాయి. ఓఎన్జీసీ (6.34%), మహీంద్రా అండ్ మహీంద్రా (6.27%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.04%), బజాజ్ ఫిన్ సర్వ్ (6.00%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.43%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.