ముంబై సిద్ధివినాయక దేవాలయం బ‌య‌టి నుంచే భ‌క్తుల పూజ‌లు!

  • మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విజృంభ‌ణ
  • ఆల‌యంలోకి కొంద‌రు భ‌క్తుల‌కే అనుమ‌తి
  • గణేశ్ అంగార్కీ చతుర్థి సందర్భంగా ఈ రోజు భ‌క్తుల ర‌ద్దీ
  • దేవాలయం లోపలకు వెళ్లలేక‌పోతోన్న భ‌క్తులు
క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో దేవాల‌యాల్లో భ‌క్తులు దేవుడి విగ్ర‌హాల‌ను కూడా ద‌ర్శించుకోలేకపోతోన్న ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. మహారాష్ట్రలో కూడా మళ్లీ కరోనా ఎక్కువగా వున్న నేప‌థ్యంలో ముంబైలోని సిద్ధివినాయక దేవాలయంలోప‌లికి  కొంద‌రికే అనుమ‌తులు ఇస్తున్నారు.

గణేశ్ అంగార్కీ చతుర్థి సందర్భంగా ఈ ఉద‌యం భక్తులు దేవాలయానికి భారీగా వ‌చ్చారు. అయితే, క్యూఆర్ కోడ్ ఉన్న ఎంట్రీపాస్ లు పరిమితంగా ఇచ్చి కొందరు భ‌క్తుల‌నే ఆల‌యంలోకి అనుమతించారు. దీంతో మిగ‌తా భక్తులు ఆలయం బయట రోడ్డుపైనే నిలబడి పూజలు చేయాల్సి వ‌చ్చింది. దేవాలయం లోపలకు వెళ్లకుండా అక్క‌డి నుంచే దేవుడికి మొక్కుకుని వెళ్లిపోయారు.


More Telugu News