మునిసిప‌ల్ ఎన్నిక‌ల నామినేష‌న్ల‌ ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై ఎస్ఈసీ కీల‌క ఆదేశాలు

  • పార్టీల నుంచి ఫిర్యాదులు
  • బల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌ను అంగీక‌రించ‌వ‌ద్ద‌న్న ఎస్ఈసీ
  • మూడో ప‌క్షం నుంచి వాటిని అంగీక‌రించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం
  • ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ స‌మ‌యంలో వీడియోలు తీయాలి
ఆంధ్రప్ర‌దేశ్‌లో మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేష‌న్ల బ‌ల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ‌ల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై పార్టీల నుంచి ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని ఎస్ఈసీ తెలిపింది. బల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌ను అంగీక‌రించ‌వ‌ద్ద‌ని త‌మ అధికారుల‌కు స్ప‌ష్టం చేసింది.

నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ నోటీసుల‌ను యాంత్రింకంగా, మూడో ప‌క్షం నుంచి వాటిని అంగీక‌రించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే, ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ స‌మ‌యంలో వీడియోల‌ను తీయాల‌ని ఆదేశించింది. మ‌రోవైపు, ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్లు, ఎన్నిక‌ల అధికారులు అందుకు త‌గ్గ చ‌ర్య‌లు తీసుకోవాలని పేర్కొంది. 


More Telugu News