రాణించిన పంత్, సుందర్... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించిన టీమిండియా

  • అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు
  • 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్
  • ఆదుకున్న పంత్, సుందర్ జోడీ
  • ప్రస్తుతం భారత్ స్కోరు 82 ఓవర్లలో 245/6
ప్రతికూల పరిస్థితుల్లో టీమిండియా మరోసారి దృఢసంకల్పం కనబర్చింది. అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను పంత్, వాషింగ్టన్ సుందర్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఇంగ్లండ్ బౌలింగ్ ను సమర్థంగా కాచుకోవడమే కాకుండా, విలువైన పరుగులు కూడా సాధించడంతో టీమిండియా కోలుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్  205 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరును కూడా అధిగమించి ఆధిక్యం దిశగా పయనిస్తోంది.

ప్రస్తుతం భారత్ స్కోరు 6 వికెట్లకు 245 పరుగులు కాగా.... పంత్ 89 పరుగులతోనూ, సుందర్ 38 పరుగులతోనూ ఆడుతున్నారు. భారత్ ఆధిక్యం 40 పరుగులకు చేరుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, స్టోక్స్, లీచ్ తలో రెండు వికెట్లు తీశారు. ఓ దశలో టీమిండియా 200 పరుగులు దాటడం కష్టమనిపించినా, పంత్, సుందర్ జోడీ పట్టుదలగా ఆడి ఇంగ్లండ్ బౌలింగ్ దాడులను నిలువరించింది.


More Telugu News