ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుంది: మైకెల్ వాన్
- టీమిండియా ఆటతీరుపై ప్రశంసల జల్లు
- భారత ఆటతీరును చూస్తే గర్వంగా ఉంది
- ఇంతకు ముందు ఆసీస్‌పై గెలిచింది
- ఇప్పుడు ఇంగ్లండ్‌పై గెలుపు: వాన్
టీమిండియా ఆటతీరుపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల టీమిండియా పిచ్‌లపై విమర్శలు చేసిన ఆయన ఉన్నట్టుండి తన తీరును మార్చుకుని భారత ఆటగాళ్లను కొనియాడడం గమనార్హం. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత క్రికెట్ ఆటతీరును చూస్తే గర్వంగా ఉందని చెప్పాడు. ఇంగ్లండ్ తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాలో ఆతిథ్య జట్టుపై టీమిండియా 2-1 తేడాతో గెలిచిందని ఆయన గుర్తు చేశాడు.
అనంతరం సొంత దేశంలో టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో మరింత బాగా రాణించిందని చెప్పాడు. టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై మొదటి టెస్టు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మిగిలిన మ్యాచులు గెలిచి 3-1 తేడాతో అద్భుతంగా రాణించిందని అన్నారు. ఒక టెస్టు జట్టుకు కావాల్సిన అర్హతలన్నీ ప్రస్తుతం టీమిండియాకు ఉన్నాయని చెప్పాడు.
అంతేకాదు, జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. కాగా, మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓడిన అనంతరం మైకెల్ వాన్ స్పందిస్తూ పిచ్‌పై తీవ్ర విమర్శలు చేశాడు.