టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు!
- పోలింగ్ విధులకు ఆటంకాలు కలిగించారని అరెస్టు
- కొల్లు రవీంద్రను కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు
- పోలీసులు సరైన ప్రక్రియను అనుసరించలేదన్న న్యాయమూర్తి
- అరెస్టులకు భయపడబోనన్న కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం జిల్లా కోర్టుకు ఆయనను తరలించారు. అయితే, పోలీసులు ఆయన అరెస్టు పట్ల సరైన ప్రక్రియను అనుసరించలేదని చెబుతూ, న్యాయమూర్తి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేశారు.
అనంతరం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ తాను అరెస్టులకు భయపడబోనని చెప్పారు. వైసీపీ పాల్పడుతోన్న అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే తనపై కేసు పెట్టారని, అయినప్పటికీ తాము న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.