ఈ వారాన్ని భారీ నష్టాల్లో ముగించిన మార్కెట్లు

  • 487 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 143 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు నష్టపోయిన బజాజ్ ఆటో షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఉదయం నుంచి లాభాల్లోనే ట్రేడ్ అయిన మార్కెట్లు చివరి రెండు గంటల్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో... మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 487 పాయింట్లు నష్టపోయి 50,792కి పడిపోయింది. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 15,030కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.28%), ఓఎన్జీసీ (0.79%), టైటాన్ కంపెనీ (0.70%), ఇన్ఫోసిస్ (0.61%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-2.98%), మారుతి సుజుకి (-2.40%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.14%), సన్ ఫార్మా (-2.06%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.03%).


More Telugu News