బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవంలో రోజా సందడి

  • హైదరాబాదులో యూనిక్ బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవం
  • హాజరైన రోజా, అన్షుమాలిక, కృష్ణలోహిత్
  • రిబ్బన్ కట్ చేసిన రోజా
  • కత్తెర చేతబూని క్రాఫింగ్
నగరి ఎమ్మెల్యే రోజా హైదరాబాదులో ఓ బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవంలో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి రోజా తనయ అన్షుమాలిక, తనయుడు కృష్ణలోహిత్ కూడా విచ్చేశారు. హైదరాబాదులోని సలీం ఖాతూన్ మసీద్ భవంతిలో యూనిక్ సెలూన్కు  కుమార్తెతో కలిసి రిబ్బన్ కటింగ్, జ్యోతి ప్రజ్వలన చేసిన రోజా... ఆపై కత్తెర అందుకుని సరదాగా క్రాఫ్ కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో 90వ దశకం హీరోయిన్ మహేశ్వరి కూడా పాల్గొన్నారు.


More Telugu News