మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన యూఏఈ క్రికెటర్లపై ఐసీసీ వేటు

  • మహ్మద్ నవీద్, షాయిమాన్ అన్వర్ లపై నిషేధం
  • 2019లో టీ10 లీగ్ లో ఫిక్సింగ్
  • ఇద్దరిపైనా ఆరోపణలు
  • అప్పట్లోనే సస్పెండైన ఆటగాళ్లు
  • తాజాగా ఎనిమిదేళ్ల నిషేధం విధించిన ఐసీసీ
ప్రపంచ క్రికెట్లో అవినీతి భూతం ఇంకా ఉనికి చాటుకుంటూనే ఉంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫిక్సింగ్ జాఢ్యం క్రికెట్ ను వీడడంలేదు. తాజాగా, ఫిక్సింగ్ ఆరోపణలు నిర్ధారణ కావడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లపై వేటు వేసింది.

మహ్మద్ నవీద్, షాయిమాన్ అన్వర్ భట్ అనే ఈ క్రికెటర్లు 2019లోనే సస్పెన్షన్ కు గురయ్యారు. యూఏఈ జట్టుకు నవీద్ కెప్టెన్ కాగా, అన్వర్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్.  ఓ టీ10 లీగ్ లో వీరిద్దరూ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. వీరిద్దరి తప్పిదాలు నిరూపితం కావడంతో ఎనిమిదేళ్లు నిషేధం విధిస్తూ ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరిపై నిషేధాలను 2019 నుంచి వర్తించేలా అమలు చేయనున్నారు.


More Telugu News