కరోనా వ్యాక్సిన్ తీసుకుని హైదరాబాదులో ఉన్నాను... ఎక్కడికీ రాలేను: ప్రివిలేజ్ కమిటీకి స్పష్టం చేసిన నిమ్మగడ్డ
- తన హక్కులకు భంగం కలిగిందంటూ పెద్దిరెడ్డి ఫిర్యాదు
- ఎస్ఈసీకి నోటీసులు పంపిన ప్రివిలేజ్ కమిటీ
- తనకు నోటీసులు పంపే పరిధి కమిటీకి లేదన్న నిమ్మగడ్డ
- శాసనసభ్యులపై గౌరవం ఉందని వెల్లడి
తన హక్కులకు ఎస్ఈసీ భంగం కలిగించారని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేయగా, మంత్రి ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ సభా హక్కుల కమిటీ (ప్రివిలేజ్ కమిటీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు నోటీసులు పంపింది. ఈ లేఖపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాను ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాలేనని తెలిపారు.
అసెంబ్లీ సభ్యులపై తనకు గౌరవభావం ఉందని, కానీ తన నుంచి సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపే అధికారం ప్రివిలేజ్ కమిటీకి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను కరోనా వ్యాక్సిన్ తీసుకుని హైదరాబాదులో ఉన్నానని వెల్లడించారు. కొన్నాళ్లపాటు ప్రయాణాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని వివరించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల సమయంలో మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.