విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మంజ్రేకర్ అభ్యంతరం
- బయటి విమర్శలను పట్టించుకోవద్దని కోహ్లీ అనడం సరికాదు
- ప్రజల స్పందనను నాన్సెన్స్ అనడం ఏమిటి?
- ధోనీ లాగే కోహ్లీ సంయమనంతో వ్యవహరించాలి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల చేసిన పలు వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు, టీవీ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అటగాళ్ల విషయంలో బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనవసరం లేదని కోహ్లీ అనడం సరికాదని చెప్పారు. ప్రజల స్పందన అంతా నాన్సెన్స్ అని కోహ్లీ అనడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటను ప్రజలు ఎంతగానో ప్రేమిస్తారని, అటువంటి వారి స్పందనను పట్టించుకోవాల్సిందేనని సంజయ్ మంజ్రేకర్ తెలిపారు. బాగా ఆడితే ఆటగాళ్లను ప్రజలు ప్రశంసిస్తారని, లేకపోతే విమర్శిస్తారని చెప్పారు. చాలా ఏళ్లుగా ఇదే కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లీ అర్థం చేసుకోవాలని, ఆయన కూడా ధోనీ లాగే సంయమనంతో వ్యవహరించాలని అన్నారు.