కారుపై సున్నం పడిందని సెలైన్ బాటిళ్లతో క్లీన్ చేయించుకున్న ప్రభుత్వ వైద్యుడు!
- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఘటన
- ఆసుపత్రికి రంగులు వేస్తున్న సమయంలో కారుపై పడిన సున్నం
- వైద్యుడిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
అత్యవసర సమయాల్లో రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ బాటిళ్లతో ఓ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు తన కారును క్లీన్ చేయించుకున్నాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు చేసిన ఈ ఘనకార్యం సోషల్ మీడియాకు ఎక్కడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రికి రంగులు వేస్తున్న సమయంలో అక్కడే నిలిపి ఉంచిన వైద్యుడి కారుపై సున్నం పడడంతో సెలైన్ బాటిల్‌తో కారును శుభ్రం చేయించుకున్నాడు.
ఎవరో దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. దీంతో వైద్యుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సెలైన్ బాటిల్‌లో నీళ్లు నింపి శుభ్రం చేశామని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అందులో నీళ్లెలా నింపారన్నది మాత్రం ప్రశ్నార్థకం.