క్వీన్ ఎలిజబెత్-2కి 10వ మునిమనవడు.. ఉబ్బితబ్బిబ్బవుతున్న రాణి

  • మూడో బిడ్డకు జన్మనిచ్చిన రాణి మనవరాలు
  • ఆసుపత్రికి వెళ్లే వ్యవధిలేక బాత్రూములోనే ప్రసవం
  • త్వరలోనే రాణిని కలవనున్న జారా తిండాల్ దంపతులు
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 కుమార్తె కూతురు జారా తిండాల్ తాజాగా ఓ బాబుకు జన్మనిచ్చారు. ఆ బాబుకు లుకాస్ ఫిలిప్ తిండాల్ అని పేరు పెట్టారు. ఫిలిప్ తిండాల్ క్వీన్ ఎలిజబెత్‌కు 10వ మునిమనవడు కావడం విశేషం. మునిమనవడు పుట్టిన సంతోషంలో రాణి మునిగితేలుతున్నారు. బ్రిటన్ సింహాసనానికి కాబోయే వారసుల్లో లుకాస్ ఫిలిప్ స్థానం 22 కావడం గమనార్హం.

జారా తిండాల్ భర్త ఇంగ్లండ్ రగ్బీ జట్టు మాజీ ఆటగాడు మైక్ తిండాల్. లుకాస్ వీరికి మూడో సంతానం. పురిటి నొప్పులు వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్లే వ్యవధి కూడా లేకపోవడంతో బాత్రూములోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత బాబును తీసుకుని తిండాల్ దంపతులు ప్యాలెస్‌కు వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.


More Telugu News