నా పేరు మీద సీఎంను విమర్శిస్తున్నారేమోనని బాధగా ఉంది: రఘురామకృష్ణరాజు

  • రచ్చబండలో రఘురామ వ్యాఖ్యలు
  • ఎస్ఈసీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే రాజీనామా కోరారని వ్యాఖ్యలు
  • ఇప్పుడు సీఎం జగన్ కు సుప్రీంలో వ్యతిరేక తీర్పు వచ్చిందని వెల్లడి
  • సీఎంను కూడా రాజీనామా చేయాలంటారేమోనని సందేహం
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన రచ్చబండ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు ఏపీ హైకోర్టులో ఎస్ఈసీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే... ఎసీఈసీ రాజీనామా చేయాలంటూ తమ పార్టీ మంత్రులు కోరారని, ఇప్పుడు సీఎం జగన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందని, మంత్రులు సీఎంను కూడా రాజీనామా చేయాలని కోరతారా...? అని సందేహం వ్యక్తం చేశారు. ఏదేమైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని రఘురామకృష్ణరాజు ఉద్ఘాటించారు.

"సీబీఐ విచారణ నుంచి తప్పుకుంటున్నానని నాపై మా పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ప్రతి శుక్రవారం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ మా సీఎం సీబీఐ విచారణకు వెళ్లడంలేదు. మరి మా పార్టీ ఎంపీలే నన్ను విమర్శించడం ద్వారా పరోక్షంగా సీఎంను కూడా విమర్శిస్తున్నారేమోనని బాధ కలుగుతోంది" అని అన్నారు.


More Telugu News