నెత్తు రోడిన రహదారి... నెల్లూరు వద్ద ప్రమాదంలో 8 మంది దుర్మరణం!
- లారీని ఢీకొన్న టెంపో
- పలువురికి గాయాలు
- క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం సమీపంలో ఈ తెల్లవారుజామున రహదారి రక్తసిక్తమైంది. దామరమడుగు సమీపంలో ఓ లారీని వెనుక నుంచి వేగంగా దూసుకుని వచ్చిన టెంపో వాహనం ఢీకొనగా, 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, సహాయక చర్యలను ప్రారంభించిన పోలీసులు, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. టెంపోలోని వారంతా తమిళనాడుకు చెందిన వారని, శ్రీశైలానికి వెళుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.