నిమ్మగడ్డ పదవీ కాలం నేటితో పూర్తి... కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్ హరిచందన్!
- నాలుగు రోజుల క్రితం అపాయింట్ మెంట్ కోరిన నిమ్మగడ్డ
- గవర్నర్ కార్యాలయం నుంచి అందని సమాచారం
- నిరాశకు గురైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుండగా, తన పదవీ విరమణ రోజున గవర్నర్ ను కలవాలన్న ఆయన కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. నాలుగు రోజుల క్రితమే నిమ్మగడ్డ, నేడు గవర్నర్ ను కలవాలని భావిస్తూ, అపాయింట్ మెంట్ ను కోరగా, గవర్నర్ ఆసక్తిని చూపలేదని తెలుస్తోంది.
నిన్నంతా ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలోనే ఉన్న నిమ్మగడ్డ, గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం వస్తుందనే భావించారు.అయితే, గవర్నర్ నుంచి అపాయింట్ మెంట్ కు సంబంధించిన సమాచారం రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తోంది.
ఇదిలావుండగా, ఈ నెల 19న తనను కలవాలని చెబుతూ, ఒకరోజు ముందుగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, నిమ్మగడ్డకు సమాచారం అందించినా, తాను ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్నానంటూ సమాచారాన్ని పంపి, ఆయన గవర్నర్ ను కలవలేదంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా గవర్నర్ కూడా నిమ్మగడ్డను కలిసేందుకు అంగీకరించక పోవడం గమనార్హం.