ఆర్థిక సంవత్సరం చివరి రోజున... భారీ నష్టాల దిశగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ!
- సెషన్ ఆరంభంలోనే నష్టాలు
- 490 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- ఒత్తిడిలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు
2020-2021 ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీలు, ఆపై మరింతగా దిగజారాయి. మధ్యాహ్నం 11.35 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 490 పాయింట్లు నష్టపోయి, 49,647 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 111 పాయింట్ల నష్టంతో 14,734 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీలు ఒకటి నుంచి నాలుగు శాతం వరకూ నష్టాల్లో నడుస్తుండగా, హెచ్సీఎల్ టెక్, ఎలక్ట్రా సిమెంట్స్, ఐటీసీ, టీసీఎస్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ తదితర కంపెనీలు అర శాతం నుంచి ఒకటిన్నర శాతం లాభాల్లో ఉన్నాయి. బ్యాంకులు, ఫైనాన్స్ సెక్టార్లలోని కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, టూరిజం, ఆటో హెల్త్ కేర్ రంగాల్లోని కంపెనీలు స్వల్పంగా లాభాల్లో ఉన్నాయి.