కొవిషీల్డ్ టీకా నిల్వకాలం 6 నుంచి 9 నెలలకు పెంపు
- భారత ఔషధ నియంత్రణ సంస్థ నిర్ణయం
- ఈ మేరకు సీరం సంస్థకు లేఖ
- మార్కెట్లోకి వెళ్లని వ్యాక్సిన్ల షెల్ఫ్ లైఫ్ పెంచుకునే అనుమతి
- అలాంటి స్టాక్ వివరాలను సమర్పించాలని ఆదేశం
భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ టీకా నిల్వ కాలాన్ని(షెల్ఫ్ లైఫ్) భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆరు నెలల నుంచి 9 నెలలకు పెంచింది. ఈ మేరకు సీరం సంస్థకు లేఖ రాసింది. టీకా ఉత్పత్తి తర్వాత నిల్వ ఉంచగలిగే కాలాన్ని షెల్ఫ్ లైఫ్ అంటారు.
ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్లకుండా.. లేబుళ్లు వేయకుండా ఉన్న వ్యాక్సిన్లకు షెల్ఫ్ లైఫ్‌ను పెంచుకునే అనుమతి ఉంటుందని డీసీజీఐ స్పష్టం చేసింది. అయితే లేబుల్ వేయని స్టాక్‌కు సంబంధించిన వివరాలను తమ కార్యాలయానికి, సెంట్రల్ డ్రగ్స్ లేబోరేటరీకి సమర్పించాలని డీసీజీఐ ఆదేశించింది.