తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్!
- తాజాగా కొంత అస్వస్థతకు గురైన సీఎస్
- కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్ గా నిర్ధారణ
- కొన్ని రోజుల పాటు విధులకు దూరం
తెలంగాణలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో పలువురు రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, ఉన్నతోద్యోగులు మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
చీఫ్ సెక్రటరీ హోదాలో ఆయన అనునిత్యం ఎంతో బిజీగా ఉంటారు. ప్రతి రోజు ఆయనను ఎందరో కలుస్తుంటారు. తాజాగా కొంత అస్వస్థతకు గురైన ఆయన... కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో, కొన్ని రోజుల పాటు విధులకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇటీవల తనను కలిసిన వారికి ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే... వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.