బీజేపీలో చేరిన సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ సోదరుడి కూతురు
- ములాయం అన్న అభయ్‌రాం కూతురు సంధ్య యాదవ్
- గతంలో జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన సంధ్య
- కుటుంబ కలహాల నేపథ్యంలో పార్టీకి దూరం
- తాజా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ
ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన పార్టీల్లో ఒకటైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత ములాయంసింగ్ యాదవ్ అన్న కూతురు సంధ్య యాదవ్ బీజేపీలో చేరారు. త్వరలో జరగనున్న జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె బీజేపీ నుంచి టికెట్ కూడా సంపాదించారు.
ములాయం అన్న అభయ్‌రాం కూతురే సంధ్య యాదవ్. ఈమె సోదరుడు ధర్మేంద్ర యాదవ్ గతంలో బదావ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. వీరంతా ఒకప్పుడు ఎస్పీలోనే ఉన్నారు. 2016లో సంధ్య యాదవ్‌ను మెయిన్‌పురి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగానూ ప్రకటించారు. అయితే, తదనంతర కాలంలో కుటుంబంలో వచ్చిన అంతర్గత కలహాల వల్ల పార్టీకి దూరమయ్యారు.
తాజాగా బీజేపీలో చేరిన ఆమె వెంటనే జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ సంపాదించారు. మెయిన్‌పురి జిల్లా ఘరోర్‌లోని వార్డ్ నెంబరు 18 నుంచి పోటీ చేయనున్నారు. ఏప్రిల్ 15-29 మధ్య అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.