అభిమాని కోరిక మేరకు ఓ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేసిన సోనూ సూద్
- మరోసారి సోనూ సూద్ దాతృత్వం
- మహారాష్ట్రలోని ఓ గ్రామానికి ఇంటర్నెట్ సేవలు
- స్నేహితుడితో కలిసి టవర్ ఏర్పాటు చేసిన సోనూ సూద్
- ఆనందంలో మునిగిన గ్రామస్థులు
నటుడు సోనూ సూద్ దాతృత్వానికి హద్దులు లేవు. తాజాగా ఆయన ఓ గ్రామంలో ఇంటర్నెట్ లేని లోటు తీర్చారు. తమ గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం లేదని ఓ అభిమాని ట్వీట్ చేయడంతో స్పందించిన సోనూ సూద్, ఏకంగా ఆ ఊర్లో ఒక సెల్ టవర్ ను నిర్మించారు. మహారాష్ట్రలోని గోడియా జిల్లాకు చెందిన అన్మోల్ బిరన్వార్, మున్నా బిరన్వార్ అనే సోదరులు కరోనా నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి వరకు 50 మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు.
అయితే వారి గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ అందకపోవడంతో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఈ విషయంలో తమకు సాయం చేయాలంటూ అన్మోల్ బిరన్వార్ నటుడు సోనూ సూద్ ను సాయం కోరాడు. ఆ సోదరుల ట్వీట్ కు స్పందించిన సోనూ సూద్ తన స్నేహితుడు కరణ్ గిల్హోత్రా సాయంతో ఓ సెల్ టవర్ నిర్మాణానికి నడుంబిగించారు. ఇటీవలే ఆ టవర్ నిర్మాణం పూర్తికావడంతో ఆ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం ఏర్పడింది. సోనూ సూద్ చలవతో ఆ గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.