అమెరికాలో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసు.. నిరసనల వెల్లువ
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని కాల్పులు
- పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన నల్లజాతీయులు
- ఘటనపై విచారణకు ఆదేశం
అమెరికాలోని మిన్నెసోటాలో పోలీసు చేతిలో మరో నల్ల జాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నేపథ్యంలో వేలాది మంది నల్లజాతీయులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. గత ఏడాది పోలీసుల చేతిలో అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే మమెరికాలో నల్ల జాతీయుడు మృతి చెందడం గమనార్హం.
డాంటే రైట్ (20) అనే యువకుడు గత అర్ధరాత్రి తన స్నేహితురాలితో కారులో వెళ్తున్నాడు. అతడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడన్న కారణంతో ఓ పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
తాము అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించామని, అయితే ఆ యువకుడు ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాల్సి వచ్చిందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు.