ఈ హత్యలు, దాడులకు కారణమైన ఏ ఒక్కడినీ వదిలిపెట్టబోం: నారా లోకేశ్
- అరాచకాలను ప్రశ్నిస్తున్నాడని మారుతిపై రాయదుర్గం ఎమ్మెల్యే గూండాలను ఉసిగొలిపారు
- బేకరీని మూయించేందుకు యత్నించారు
- రాంపురంకు వెళ్లిన మారుతిపై గూండాలతో దాడి చేయించారు
టీడీపీ కార్యకర్త మారుతి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అరాచకాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారనే కారణంతో ఆయనపై గూండాలతో దాడి చేయించారని నారా లోకేశ్ మండిపడ్డారు. అరాచకాలను వెలుగులోకి తీసుకొస్తున్నారనే కారణంతో మారుతికి జీవనాధారమైన బేకరీని కూడా మూయించేందుకు యత్నించి విఫలమయ్యారని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా రాంపురంకు వెళ్లిన మారుతిపైకి తన గూండాలను ఉసిగొల్పారని, వైసీపీ అరాచకాలకు ఇది పరాకాష్ట అని అన్నారు. మారుతికి మెరుగైన వైద్యం అందించి, ఆయనకు అన్ని విధాలా పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. తమ కార్యకర్తల సాక్షిగా చెపుతున్నానని... ఈ హత్యలు, దాడులకు కారణమైన ఏ ఒక్కడినీ వదిలిపెట్టబోమని ట్వీట్ చేశారు.