కరోనాతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు

  • కరోనా లక్షణాలతో బాధపడుతున్న కాలవ
  • ప్రాథమిక పరీక్షలో పాజిటివ్
  • కొనసాగుతున్న చికిత్స
  • స్వయంగా వెల్లడించిన టీడీపీ నేత
  • త్వరగా కోలుకోవాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రాథమిక పరీక్షలో కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలిందని, ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని వివరించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారిలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

కాగా, కాలవ శ్రీనివాసులుకు కరోనా సోకిందన్న విషయం తెలియడంతో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిందని, ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.


More Telugu News