ఈ ప్రపంచంలో స్వచ్ఛత అనే దానికి పర్యాయపదమే అమ్మ: సింగర్ సునీత
- వాట్సాప్ నంబర్ అడిగిన నెటిజన్
- సున్నితంగా తిరస్కరించిన సునీత
- సారీ అండీ అంటూ నవ్వుతూ సమాధానం
- ప్రతిరోజు ఇన్‌స్టాలో లైవ్ లో పాటలు పాడుతున్న సింగర్
కరోనా వేళ ఆంక్షలు అమలులో ఉండడంతో ప్రజలు రాత్రి సమయంలో ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి 8.30 గంటల వరకు సింగర్ సునీత అభిమానులతో మాట్లాడుతూ వారు కోరిన పాటలు పాడుతున్నారు.
కరోనా విపత్కర సమయంలో తాను వారితో ముచ్చటిస్తూ పాటలు పాడుతుండడంతో అభిమానులు కాస్త ఉపశమనం పొందుతున్నారని సునీత చెబుతున్నారు. అందుకే తాను ప్రతిరోజు లైవ్ లో మాట్లాడుతున్నానని చెప్పారు. అయితే, సునీత తాజాగా ఇన్‌స్టాలో పాటలు పాడుతుండగా ఓ నెటిజన్ స్పందిస్తూ ఆమె వాట్సాప్ నంబర్ చెప్పాలని అడిగాడు. దానికి.. 'సారీ అండీ' అంటూ నవ్వుతూ ఆమె సమాధానం ఇచ్చారు.
కాగా, అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఓ పాట పాడాలని ఓ నెటిజన్ అడిగాడు. అమ్మ అనగానే కన్నీరు వస్తుందని, ఈ ప్రపంచంలో స్వచ్ఛత అనే దానికి పర్యాయపదమే అమ్మ అని సునీత చెప్పారు. కరోనా సమయంలో ఆసుపత్రిలో చాలా మంది రోగులను కూడా వైద్య సిబ్బంది బిడ్డలా చూసుకుంటున్నారని అన్నారు.
ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకట్లేదని తెలిపారు. చాలా మంది అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆమె పిలుపునిచ్చారు.