త్రివిధ దళాల మధ్య ఇంతటి సమన్వయం మునుపెన్నడూ లేదు: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్
- కరోనా కట్టడికి అనుక్షణం శ్రమిస్తున్నాయి
- అన్ని వనరులనూ వినియోగించుకుంటూ ముందుకు
- కరోనాతో పాటు బార్డర్ లోనూ పోరాటం
- గ్రామీణ ప్రాంతాలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సరఫరా
- ఆక్సిజన్ నింపిన సిలిండర్లను విమానాల్లో తీసుకెళ్లడం నిషిద్ధం
కరోనాతో పోరులో త్రివిధ దళాలు చాలా బాగా పనిచేస్తున్నాయని, ఇంతకుముందెన్నడూ లేనంతగా సమన్వయంతో ముందుకుపోతున్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. అన్ని వనరులనూ వినియోగించుకుంటూ కరోనా కట్టడికి భద్రతా బలగాలు పాటుపడుతున్నాయని కొనియాడారు.
గ్రామీణ ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేయడం కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేస్తున్నామని రావత్ తెలిపారు. తమ వద్ద ఆక్సిజన్ ప్లాంట్లు లేవని, ఆర్మీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఉంటే తామే స్వయంగా తయారు చేసి పంపిణీ చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఆక్సిజన్ నింపిన సిలిండర్లను విమానాల్లో తరలించడానికి నిబంధనలు ఒప్పుకోవన్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ సాయపడుతున్నామన్నారు.
కరోనా కట్టడికి పాటుపడుతున్న బలగాలు, పరికరాల తరలింపునకు వైమానిక దళం స్వచ్ఛందంగా సాయం చేస్తోందన్నారు. త్రివిధ దళాధిపతుల ఆదేశానుసారం బలగాలు నడుచుకుంటున్నాయని చెప్పారు. ఓ వైపు కరోనా కట్టడికి సాయం చేస్తూనే సరిహద్దుల్లోనూ బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయని గుర్తు చేశారు.
సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, చొరబాట్లు జరగకుండా చూస్తున్నామని చెప్పారు. సమయానుసారంగా ముప్పు తీవ్రతపై విశ్లేషణలు చేస్తూనే ఉన్నామన్నారు. దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.