క‌రోనా విజృంభ‌ణ‌తో 10 మంది మావోయిస్టుల మృతి

  • కలుషితాహారం కూడా కారణం
  • ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఘ‌ట‌న‌
  • 100 మందికిపైగా మావోయిస్టులకు కొవిడ్  
దేశంలో రెండో ద‌శ క‌రోనా విజృంభ‌ణ‌తో మావోయిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా, కలుషితాహారం కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్ వెల్ల‌డించారు.

దంతెవాడ జిల్లా, దక్షిణ బస్తర్‌ అడవుల్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా రెండో ద‌శ విజృంభణ కార‌ణంగా 100 మందికిపైగా మావోయిస్టులకు కొవిడ్ సోకింద‌ని అభిషేక్ ప‌ల్ల‌వ్ తెలిపారు.  


More Telugu News