ఏపీలో ఉన్నంత నీచ రాజకీయాలు మరెక్కడా లేవు: మంత్రి అప్పలరాజు
- రుయా ఘటన ప్రమాదవశాత్తు జరిగింది
- బాధ్యతగా ఉండాల్సిన సమయంలో టీడీపీ క్యాండిల్ ర్యాలీ చేపట్టింది
- కడుపుకు అన్నం తింటున్నారా?
- పుష్కరాల్లో 40 మంది చనిపోయిన ఘటనను చంద్రబాబు మర్చిపోయారా? అన్న మంత్రి
టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నేతలపై ఏపీ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పారు. ముఖ్యమంతి జగన్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం పార్టీ క్యాండిల్ ర్యాలీ చేపట్టిందని దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు బుద్ధుందా? కడుపుకు అన్నం తింటున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పుష్కరాల్లో 40 మంది చనిపోయిన ఘటనను చంద్రబాబు మర్చిపోయారా? అని అప్పలరాజు ప్రశ్నించారు. అప్పుడే ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టుంటే బుద్ధొచ్చి ఉండేదని అన్నారు. సిగ్గులేకుండా దయ్యంలా క్యాండిల్ ర్యాలీ చేస్తావా? అంటూ అచ్చెన్నాయుడిపై మండిపడ్డారు. విజయవాడలోని కోవిడ్ ఆసుపత్రిలో కొందరు చనిపోయినప్పుడు... హాస్పిటల్ పై విచారణ జరపొద్దంటూ కోర్టులకు వెళ్లారని అన్నారు. ఏపీలో ఉన్నంత నీచ రాజకీయాలు మరెక్కడా లేవని దుయ్యబట్టారు.