ఏ రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణకే ఎందుకు?: సజ్జల
- ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు ఆపొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పింది
- అయినా తెలంగాణ పోలీసులు ఆపుతున్నారు
- తెలంగాణ వ్యవహారంపై కోర్టులను ఆశ్రయిస్తాం
తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పినప్పటికీ తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తోందని... కోర్టులను ఆశ్రయించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ఏపీలోని కరోనా పేషెంట్లు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని... ఏ రాష్ట్రానికి లేని సమస్య తెలంగాణకే ఎందుకని ప్రశ్నించారు.ఈ అంశాన్ని మానవత్వంతో చూడాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించారని... సరైన మౌలికవసతులు కూడా లేని ప్రాంతాలను ఏపీకి ఇచ్చారని దుయ్యబట్టారు.