అంతిమ యాత్రలో ఒక్కసారిగా కళ్లు తెరిచిన బామ్మ!
- మహారాష్ట్రలో ఘటన
- బామ్మకు కరోనా
- ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
- బెడ్ దొరకక అపస్మారకస్థితిలోకి బామ్మ
- చనిపోయిందని బావించిన వైనం
ఓ బామ్మ చనిపోయిందని భావించిన ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి అంతిమయాత్ర నిర్వహించించారు. అయితే, అదే సమయంలో ఆ బామ్మ కళ్లు తెరిచింది. చనిపోయిందని భావించిన తమ బామ్మ మళ్లీ కళ్లు తెరవడంతో వారంతా కాసేపు విస్మయానికి గురయ్యారు.
అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముధాలే, బారామతి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ (76)కు ఈ నెల 10న కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కుటుంబ సభ్యులు ఆమెను కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రులన్నీ నిండిపోయి ఉండడంతో ఆమెకు బెడ్ లభించలేదు. కారులోనే ఆమె చాలా సేపు ఉండడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ఆమెలో కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె మృతి చెందిందని భావించి, ఇంటికి తీసుకెళ్లారు. తమ బంధువులకు ఈ విషయాన్ని తెలిపి అంతిమ యాత్ర చేస్తుండగా బామ్మ కళ్లు తెరిచింది. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రికి చికిత్స అందుతోంది.