కోహ్లీ నా కాళ్లు మొక్కబోయాడు.. వద్దని వారించాను: సచిన్ టెండూల్కర్
- కోహ్లీని కలిసిన తొలి సందర్భాన్ని గుర్తు చేసిన మాస్టర్
- ఏం జరుగుతోందో అర్థం కాలేదని కామెంట్
- అందరూ తమను చూసి నవ్వారన్న క్రికెట్ గాడ్
సచిన్ టెండూల్కర్.. ఈ పేరు చాలు క్రికెట్ ప్రపంచానికి వన్నె తెచ్చిందని చెప్పడానికి. క్రికెట్ దేవుడంటూ అభిమానుల మన్ననలను అందుకున్న వ్యక్తి ఆయన. నూనూగు మీసాల ప్రాయంలో క్రికెట్ లోకంలోకి అడుగుపెట్టే చాలా మందికి ఆ దేవుడంటే ఎనలేని భక్తి. అందులో నేటి మేటి బ్యాట్స్ మన్ కింగ్ కోహ్లీ కూడా ఒకడు.
తన ఆరాధ్య దైవం తొలిసారి తనకు చేరువగా వస్తే ఎవరికైనా ఎంతటి ఆనందం కలుగుతుంది? కోహ్లీదీ అదే పరిస్థితి. వెంటనే అతడు ఆ దైవం పాదాలమీద పడబోయాడట. పాదాభివందనం చేయాలనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ టెండూల్కరే వెల్లడించాడు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆసక్తికర ఘటనను గుర్తు చేసుకున్నాడు.
“టీమ్ లోకి వచ్చిన కొత్తల్లో తొలిసారి కోహ్లీని కలిసినప్పుడు.. అతడు నా కాళ్లమీద పడబోయాడు. ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. ఏం చేస్తున్నావని కోహ్లీని అడిగాను. ఇలాంటివి అస్సలు చేయొద్దని వారించాను. ఇంకెప్పుడూ ఇలాంటివి జరగకూడదని చెప్పా. దీంతో అతడు పైకి లేచాడు. మమ్మల్నే చూస్తూ నవ్వుతున్న తోటి ప్లేయర్లవైపు చూడడం మా వంతైంది’’ అని సచిన్ ఆ నాటి సంఘటనను గుర్తు చేశాడు. జట్టులోకి ఏ కొత్త ఆటగాడు వచ్చినా సచిన్ కు పాదాభివందనం చేయాలంటూ యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు చెప్పడంతో కోహ్లీ అలా చేశాడట మరి!