హమాస్ దాడుల్లో మరణించిన సౌమ్య కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడి పరామర్శ
- ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర పోరు
- బలవుతున్న అమాయకులు
- సౌమ్య మృతి పట్ల ఇజ్రాయెల్ తీవ్ర విచారం
- సంతాపం తెలిపిన దేశాధ్యక్షుడు రెవిన్ రివ్లిన్
ఇజ్రాయెల్ భద్రతా దళాలకు, పాలస్తీనా హమాస్ ఉగ్రవాద సంస్థకు మధ్య జరుగుతున్న భీకరపోరులో ఎందరో అమాయకులు బలవుతున్నారు. కేరళకు చెంది సౌమ్య సంతోష్ అనే మహిళ కూడా హమాస్ దాడులకు బలైంది. ఆమెకు భర్త, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వారు కేరళలో నివసిస్తుంటారు. ఇజ్రాయెల్ నుంచి శాశ్వతంగా వచ్చేసి కేరళలో స్థిరపడదామని సౌమ్య భావిస్తున్న తరుణంలో ఈ ఘోరం జరిగింది. కాగా, సౌమ్య మరణం పట్ల ఇజ్రాయెల్ వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాయి.
సౌమ్య మృతి పట్ల ఇజ్రాయెల్ విలపిస్తోందని భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు రెవెన్ రివ్లిన్ కేరళలో ఉన్న సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ఫోన్ చేసిన ఆయన ఓదార్పు వచనాలు పలికారు. సౌమ్య మృతి పట్ల రివ్లిన్ సంతాపం వ్యక్తం చేశారు. అటు, ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి రోనీ యెడీడియా సోషల్ మీడియాలో స్పందించారు. సౌమ్య మరణానికి పరిహారం చెల్లిస్తామని, ఆమె కుటుంబ బాధ్యతను ఇజ్రాయెల్ అధికారులు స్వీకరిస్తారని వెల్లడించారు.