ఏపీ డెయిరీ ఆస్తులపై హైకోర్టులో విచారణ... ఈ నెల 27కి వాయిదా
- ఏపీ డెయిరీ ఆస్తులు అమూల్ పరం
- కేబినెట్ నిర్ణయం
- హైకోర్టులో పిటిషన్ వేసిన రఘురామకృష్ణరాజు
- ఈ నెల 19న జీవో జారీ చేసిన సర్కారు
- జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేయాలన్న హైకోర్టు
ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థ పరం చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయించడాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
వాదనల సందర్భంగా, ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారా? అని రఘురామ తరఫు న్యాయవాదిని హైకోర్టు అడిగింది. తాము పిటిషన్ వేసిన తర్వాత జీవో నెం.117 జారీ అయిందని రఘురామ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, జీవోను సవాల్ చేస్తూ అనుబంధ పిటిషన్ వేయాలని హైకోర్టు రఘురామ న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఇటీవలే ఏపీ డెయిరీ అంశంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ డెయిరీకి వివిధ జిల్లాల్లో ఉన్న నిరర్ధక ఆస్తులను నామమాత్రపు లీజుతో అమూల్ కు అప్పగించాలని తీర్మానించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలపడంతో, ఈ నెల 19న జీవో నెం.117 జారీ అయింది. అయితే, ఇది ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ లిమిటెడ్ ను లేకుండా చేసే ప్రయత్నమని ఇవాళ్టి విచారణలో రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు.