గుండెపోటుతో టాలీవుడ్ నిర్మాత బీఏ రాజు కన్నుమూత

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • దాదాపు 1500 సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించిన రాజు
  • భార్య బి.జయ దర్శకత్వం వహించిన సినిమాలను నిర్మించిన రాజు
టాలీవుడ్‌లో వరుస విషాదాలు జరుగుతున్నాయి. మొన్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.జయరామ్ కరోనాతో మృతి చెందగా, గతరాత్రి ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న ఆయన గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు శివకుమార్ తెలిపారు.

సినీ పీఆర్వోగా చిరపరిచితుడైన బీఏ రాజు దాదాపు 1500 సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. భార్య బి.జయ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ‘సూపర్ హిట్’ అనే సినీ పత్రికను కూడా కొన్నాళ్లపాటు నడిపారు. 2018లో రాజు భార్య జయ మరణించారు. రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు.


More Telugu News