పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
- రోడ్డు ప్రమాదానికి గురైన ప్రసన్నకుమార్ రెడ్డి
- ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ
- పూర్తిగా ధ్వంసమైన కారు వెనుక భాగం
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటన ఇనమడుగు క్రాస్ రోడ్డు సమీపంలో జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రసన్నకుమార్ రెడ్డి కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు విజయా డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, దేవుడి దయ వల్లే ప్రాణాలతో బయటపడ్డామని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.