ప్రభుదేవాతో గొడవేం లేదన్న స్టార్ ప్రొడ్యూసర్

  • తొలి హిట్ వెంకటేశ్ 'శత్రువు'
  • 'ఒక్కడు'తో మహేశ్ కి తిరుగులేని సక్సెస్
  • 'వర్షం' ప్రభాస్ ఎప్పటికీ మరిచిపోలేని హిట్
  • నిరాశ పరిచిన 'పౌర్ణమి' ఫలితం  
తెలుగులో భారీ విజయాలను అందించిన నిర్మాతగా ఎమ్మెస్ రాజు కనిపిస్తారు. వెంకటేశ్ హీరోగా వచ్చిన 'శత్రువు' నిర్మాతగా ఆయన తొలి సినిమా. ఆ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత ఆయన నిర్మించిన 'మనసంతా నువ్వే' .. 'ఒక్కడు' వసూళ్ల వర్షం కురిపించాయి. 'ఒక్కడు' సినిమా .. మహేశ్ బాబు కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోయింది. ఆ తరువాత ఆయన ప్రభాస్ హీరోగా 'వర్షం' సినిమాను నిర్మించారు. తన కెరియర్లో తనకి బాగా ఇష్టమైన సినిమా 'వర్షం' అని ప్రభాస్ ఇప్పటికీ చెబుతుండటం, ఈ సినిమా ప్రత్యేకతను చాటి చెబుతుంది.

ఇక 'వర్షం' సూపర్ హిట్ తరువాత ప్రభాస్ హీరోగా ఎమ్మెస్ రాజు మరో సినిమాను నిర్మించారు .. ఆ సినిమా పేరే 'పౌర్ణమి'.  ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్ర్రేక్షకులను నిరాశ పరిచింది. ఆ సమయంలోనే ప్రభుదేవాకు .. ఎమ్మెస్ రాజుకు మధ్య గొడవ జరిగిందనే టాక్ వచ్చింది. సందర్భాన్ని బట్టి ఇప్పటికీ ఆ మాట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ .. " నిజమే అప్పట్లో ఆ టాక్ వచ్చింది .. కానీ అందులో నిజం లేదు. ప్రభుదేవాతో ఎలాంటి గొడవలు లేవు .. ఇప్పటికీ మేమిద్దరం ఎంతో సన్నిహితంగా ఉంటాము" అని చెప్పుకొచ్చారు.



More Telugu News