ధూళిపాళ్ల నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గం సమావేశం
- సంగం డెయిరీలో అక్రమాల పేరిట ధూళిపాళ్ల అరెస్ట్
- ఇటీవలే బెయిల్ పై విడుదల
- విజయవాడలో సమావేశమైన సంగం డెయిరీ పాలకవర్గం
- పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇటీవలే బెయిల్ పై విడుదల కావడం తెలిసిందే. ఈ క్రమంలో, ధూళిపాళ్ల నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గం నేడు విజయవాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా డెయిరీ తరఫున పలు నిర్ణయాలు తీసుకున్నారు.
దీనిపై ధూళిపాళ్ల మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 5 వేల లీటర్ల కెపాసిటీ ఉన్న బల్క్ కూలర్ నెలకొల్పనున్నామని, కుప్పంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా కిలో వెన్నకు రూ.710 చెల్లిస్తామని, 10 శాతం వెన్న ఉండే గేదె పాలకు రూ.71.50 చెల్లిస్తామని వివరించారు. పశుదాణా కోసం ఈ ఏడాది 2 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేస్తామని ధూళిపాళ్ల తెలిపారు.