కథ కోసమే కష్టాలు పడుతున్న వంశీ పైడిపల్లి!

  • నేను కథలు రెడీ చేసుకోలేను
  • రచయితలపై ఆధారపడవలసిందే
  • అందుకే ఆలస్యం అంటున్న వంశీ పైడిపల్లి  
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరుగా కనిపిస్తారు. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఆయన ఒక్కో ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంటారు. నిదానం అనేది మరికాస్త సమయం తీసుకుంటే అది ఆలస్యమవుతుంది. వంశీ పైడిపల్లి నుంచి వస్తున్న సినిమాల విషయంలో అదే జరుగుతోంది. సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ పెరిగిపోతూ, ఆయన నుంచి రెండు మూడేళ్లకు ఒక సినిమా వస్తోంది. 'మహర్షి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆయన, ఇంతవరకూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు వంశీ పైడిపల్లి సమాధానమిస్తూ .. "నేను కథలు రాసుకోలేను .. కథల కోసం రచయితలపై ఆధారపడవలసి వస్తోంది" అన్నారు. కథలో మార్పులు చేయించవలసి వచ్చినప్పుడు, రచయితలను పట్టుకుని ఆ పనిని పూర్తి చేయించవలసి ఉంటుంది. అందువలన మరింత ఆలస్యమవుతోంది. ఇకపై అలా జరగకుండా ముందుగానే కథలను రెడీ చేసిపెట్టుకుంటాను" అంటూ వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు. విజయ్ హీరోగా .. దిల్ రాజు బ్యానర్లో ఆయన ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.


More Telugu News