వెనక్కి వెళ్లిన 'ఛత్రపతి' రీమేక్ .. ముందుకొచ్చిన 'కర్ణన్' రీమేక్!
- 'ఛత్రపతి' హిందీ రీమేక్ ఆలోచన వాయిదా
- 'కర్ణన్' రీమేక్ వైపు మొగ్గుచూపుతున్న హీరో
- దర్శకుడిగా తెరపైకి శ్రీకాంత్ అడ్డాల పేరు
బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ తొలినాళ్లలోనే మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అడపా దడపా హిట్లు కొడుతూ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. పరాజయాలు పలకరించినా పట్టుదలతో ముందుకు వెళుతున్నాడు. ఇటీవల తెలుగులో 'అల్లుడు అదుర్స్ ' సినిమా చేసిన శ్రీనివాస్, ఆ తరువాత సినిమాను హిందీలో చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలుగులో ప్రభాస్ చేసిన 'ఛత్రపతి' సినిమాను, వినాయక్ దర్శకత్వంలో హిందీలో చేయాలనుకున్నాడు.
ఆ తరువాత తమిళంలో ధనుశ్ చేసిన 'కర్ణన్'ను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు. అయితే కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడట. 'ఛత్రపతి' రీమేక్ ను కొంతకాలం పాటు హోల్డ్ లో పెట్టేసి, ముందుగా 'కర్ణన్' రీమేక్ చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల పేరు వినిపిస్తోంది. తమిళంలో 'కర్ణన్' భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రీమేక్ రైట్స్ ను దక్కించుకున్న శ్రీనివాస్, హీరోగా .. నిర్మాతగా ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో చూడాలి మరి.